ముఖ్య గమనిక:
- ఏదైనా కొనుగోలుకు రీఫండ్ కోసం అర్హత ఉందో లేదో చెక్ చేయడానికి, Google Play రీఫండ్ పాలసీల గురించి తెలుసుకోండి.
- ప్రస్తుత రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి, మీ రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి.
మా రీఫండ్ పాలసీల ఆధారంగా, కొన్ని Google Play కొనుగోళ్లకు Google రీఫండ్‌లను అందించవచ్చు. మీరు నేరుగా డెవలపర్‌ను కూడా సంప్రదించవచ్చు.
- మీ కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్ ద్వారా, మీరు గానీ, మీకు తెలిసిన వారు గానీ చేయని Google Play కొనుగోలును మీరు కనుగొంటే, లావాదేవీ జరిగిన 120 రోజుల లోపు అనుమతి లేని ఛార్జీలను రిపోర్ట్ చేయండి.
- ఒకే లావాదేవీ కోసం పలుమార్లు రిక్వెస్ట్ చేయడం వలన రీఫండ్ ప్రాసెస్ వేగవంతం కాదు. దయచేసి రీఫండ్ విషయంలో నిర్ణయం తీసుకోవడం కోసం 1–4 రోజుల సమయం పడుతుందని గమనించండి.
ఐరోపా ఆర్థిక మండలి (EEA) & యునైటెడ్ కింగ్‌డమ్ యూజర్‌ల కోసం
మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండి, మార్చి 28, 2018న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసినట్లయితే, రీఫండ్‌ను పొందడం ఎలాగో తెలుసుకోండి.
రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి
మీరు ఎగువ పేర్కొన్న లింక్ ద్వారా రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీ కొనుగోలు కనిపించకపోతే, మీరు Google Play వెబ్‌సైట్ నుండి రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు:
- play.google.com లింక్‌కు వెళ్లండి.
- ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను క్లిక్ చేయండి.
- పేమెంట్‌లు & సబ్స్క్రిప్షన్లు
బడ్జెట్ & ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు రిటర్న్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌కు సంబంధించి, సమస్యను రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ పరిస్థితిని వివరించే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఫారమ్‌ను పూర్తి చేసి, మీరు రీఫండ్‌ను కోరుకుంటున్నట్లు సూచించండి.
- సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు ఆర్డర్‌ను కనుగొనలేకపోతే, దాన్ని మీరు వేరొక Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేసి ఉంటారు. ఖాతాలను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
- సాధారణంగా మీకు ఒక రోజు లోపే నిర్ణయం గురించి తెలియజేయడం జరుగుతుంది, కానీ కొన్నిసార్లు గరిష్ఠంగా నాలుగు రోజుల సమయం పట్టవచ్చు.
- హార్డ్‌వేర్ పరికరాల విషయంలో: మీరు Google Storeలో కొనుగోలు చేసిన పరికరాలను రిటర్న్ చేయడానికి లేదా రీఫండ్‌ను పొందడానికి Google Store రీఫండ్‌ల పేజీకి వెళ్లండి.
యాప్ డెవలపర్ నుండి సపోర్ట్‌ను పొందండి
కింద పేర్కొన్న సందర్భాలలో మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించాలి:
- మీకు యాప్ గురించి సందేహం ఉన్నప్పుడు.
- మీరు యాప్‌లో చేసిన కొనుగోలు అందనప్పుడు లేదా మీరు ఆశించిన మేరకు అది పని చేయనప్పుడు.
- మీరు కొనుగోలు చేసిన 48 గంటల తర్వాత రీఫండ్‌ను కోరుకుంటే.
డెవలపర్, కొనుగోలు సంబంధిత సమస్యల విషయంలో సహాయం చేయగలరు, అలాగే కొనుగోలు సంబంధిత పాలసీలకు, వర్తించే చట్టాలకు అనుగుణంగా రీఫండ్‌లను ప్రాసెస్ చేయగలరు.
చిట్కా: రీఫండ్ రిక్వెస్ట్‌లకు సంబంధించిన కొంత సమాచారాన్ని డెవలపర్‌లతో షేర్ చేసే అవకాశం ఉంది.