మీరు రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. రీఫండ్ మంజూరు చేయబడుతుందా లేదా అనే నిర్ణయాన్ని అందుకోవడానికి సాధారణంగా 1–4 రోజులు పడుతుంది.
మీ రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి
మీ రీఫండ్ రిక్వెస్ట్‌కు ఆమోదం లభిస్తే, Google Play నుండి వచ్చే రీఫండ్‌లు, ఒరిజినల్‌గా కొనుగోలు చేయడానికి ఉపయోగించిన పేమెంట్ ఆప్షన్‌లకు సాధారణంగా జమ అవుతాయి. చాలా వరకు రీఫండ్‌లు 10 పని దినాలలోపు ప్రాసెస్ చేయబడతాయి, అయితే మీరు ఎలా పేమెంట్ చేశారనే దాని మీద రీఫండ్‌లకు పట్టే సమయం ఆధారపడి ఉండవచ్చు. Google Play కొనుగోళ్లకు ��ంబంధించిన రీఫండ్ టైమ్‌లైన్‌ల గురించి మరింత తెలుసుకోండి.
చిట్కాలు:
- మీ రీఫండ్ కోసం మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడితే, మీ Google Pay ఖాతాలో మీ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయండి.
- మీ రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్ "రీఫండ్ చేయబడింది" అని ఉంటే, మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపించాలి.
- మీ రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్ "రద్దు చేయబడింది" అని ఉంటే, ఆర్డర్‌కు ఎప్పుడూ ఛార్జీ విధించబడదు, కాబట్టి మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపించదు.