కింద వివరించిన రీఫండ్ పాలసీల ఆధారంగా, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొన్ని కొనుగోళ్లకు Google రీఫండ్‌లను అందించవచ్చు. మీరు ఏమి కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎలా పే చేశారు, మీరు ఎక్కడ ఉన్నారు అనే అంశాలపై ఆధారపడి రీఫండ్ పాలసీలు భిన్నంగా ఉంటాయి.
మీ ఖాతా లేదా పేమెంట్ వివరాలను మరొకరికి ఇచ్చినా, మా పాలసీలను దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపించినా, లేదా మీ ఖాతాకు ప్రామాణీకరణతో కూడిన రక్షణను కల్పించక పోయినా, మేము సాధారణంగా రీఫండ్ ఇవ్వలేము.
- మీ కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్ ద్వారా, మీరు గానీ, మీకు తెలిసిన వారు గానీ చేయని Google Play కొనుగోలును మీరు కనుగొంటే, లావాదేవీ జరిగిన 120 రోజుల లోపు అనుమతి లేని ఛార్జీలను రిపోర్ట్ చేయండి.
- మీ కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్ ద్వారా చేసిన Google Play కొనుగోలు మీ ఖాతాతో ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ ద్వారా అనుకోకుండా జరిగిందని మీరు కనుగొంటే, బదులుగా రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి.
Play Storeలోని చాలా యాప్‌లను Google కాకుండా థర్డ్-పార్టీ డెవలపర్‌లు రూపొందిస్తారు. డెవలపర్, కొనుగోలు సంబంధిత సమస్యల విషయంలో సహాయం చేయగలరు, అలాగే కొనుగోలు సంబంధిత ��ాలసీలకు, వర్తించే చట్టాలకు అనుగుణంగా రీఫండ్‌లను ప్రాసెస్ చేయగలరు. మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేస్తుంటే, యాప్ డెవలపర్‌ను నేరుగా సంప్రదించడం అనేది సమస్యను పరిష్కరించడానికి సాధారణంగా వేగవంతమైన మార్గం. Android యాప్ డెవలపర్‌ను సంప్రదించడం ఎలాగో తెలుసుకోండి.
మీరు కొనుగోలు చేసినప్పుడు Google Play పాయింట్‌లను పొందితే, కొనుగోలు సంబంధిత రీఫండ్ పొందినట్లయితే, Google Play పాయింట్‌ల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
లాభాపేక్ష రహిత సంస్థలకు ఇచ్చిన విరాళాలకు రీఫండ్‌ను పొందలేరు.
రీఫండ్ రిక్వెస్ట్‌లు & స్టేటస్
- రీఫండ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.
- మీ రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి.
- రీఫండ్ టైమ్‌లైన్‌లను రివ్యూ చేయండి.
ఐరోపా ఆర్థిక మండలి (EEA) & యునైటెడ్ కింగ్‌డమ్ యూజర్‌ల కోసం
మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండి, మార్చి 28, 2018న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసినట్లయితే, రీఫండ్‌ను పొందడం ఎలాగో తెలుసుకోండి.
ప్రోడక్ట్‌ల వారీగా పాలసీలు
- యాప్‌లు, గేమ్‌లు, ఇంకా యాప్‌లో కొనుగోళ్లు (సబ్స్క్రిప్షన్లతో సహా)
- Google Play Books
- Google Play గిఫ్ట్ కార్డ్‌లు, Google Play బ్యాలెన్స్
- Google Play గిఫ్ట్‌లు
- Google Play Pass
- Google TV
- Subscribe with Google
- YouTube
పేమెంట్ ఆప్షన్ ప్రకారంగా పాలసీలు
- Google Play పాయింట్లతో పే చేసిన ఐటెమ్‌లకు రీఫండ్లు
- నగదు, బ్యాంక్ బదిలీ, లేదా కోడ్ ఉపయోగించి పేమెంట్ చేసిన ఐటెమ్‌లకు రీఫండ్లు
నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన పాలసీలు
- సబ్స్క్రిప్షన్లకు పాక్షిక రీఫండ్లు (ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లేదా జర్మనీలో మాత్రమే)
- ఐరోపా ఆర్థిక మండలి, యునైటెడ్ కింగ్‌డమ్‌ల రీఫండ్ పాలసీలు