మీరు Google Playలోమీ యాప్ లేదా రివ్యూతో సమస్యను ఎదుర్కొంటే, దిగువ ఆప్షన్‌లతో కూడిన సమాచారంతో, మీరు దాన్ని మా టీమ్‌కు ఫ్లాగ్ చేయవచ్చు. మేము మీ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా పరిగణనలోనికి తీసుకుంటాము, అలాగే Google Play అనుభవాన్ని మెరుగుపరచడంలో మీరందించిన సహాయానికి మేము అభినందిస్తున్నాము.
యాప్ గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి
ఫిర్యాదు చేయడం లేదా యాప్ లేదా రివ్యూను ఫ్లాగ్ చేయడం:
- ఉద్దేశం: ఏదైనా సమస్యను లేదా పాలసీ ఉల్లంఘనను రివ్యూ చేసి, చర్య తీసుకోవడానికి Google టీమ్‌కు నేరుగా సదరు సమస్య గురించి లేదా పాలసీ ఉల్లంఘన గురించి రిపోర్ట్ చేయడం కోసం ఈ విధానాన్ని ఉపయోగిస్తారు.
- దేని గురించి రిపోర్ట్ చేయాలి: మీరు యాప్‌ను ఇష్టపడకపోవడం వంటివి కాకుండా ఇతర సమస్యలను ఫ్లాగ్ చేయాలి, ఉదాహరణకు Google Play డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీల ఉల్లంఘనలు (ఉదా., డెవలపర్లు మోసపూరిత లేదా ప్రోత్సాహకాల వల్ల వచ్చిన రివ్యూల ద్వారా యాప్ ప్లేస్‌మెంట్‌ను మార్చడానికి ప్రయత్నించడం), లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్. మీరు ఇతర యూజర్‌లు చేసిన అనుచిత కామెంట్‌లను లేదా రివ్యూలను, లేదా డెవలపర్ కామెంట్ పోస్టింగ్ పాలసీని ఉల్లంఘించే డెవలపర్ రిప్లయిలను కూడా ఫ్లాగ్ చేయవచ్చు.
యాప్‌ను ఫ్లాగ్ చేయండి
- Google Play యాప్
ను తెరవండి.
- ఏదైనా యాప్‌నకు లేదా గేమ్‌కు సంబంధించిన వివరాల పేజీకి వెళ్లండి.
- మరిన్ని
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- కారణాన్ని ఎంచుకోండి.
- సమర్పించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: ఇతర యూజర్‌లకు యాప్ గురించి ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి, మీరు Google Playలో పబ్లిక్ రివ్యూను ఇవ్వవచ్చు. రివ్యూల గురించి మరింత తెలుసుకోండి.
ఏదైనా రివ్యూపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి
యూజర్ రివ్యూలు:
- ఉద్దేశం: ఇతర యూజర్‌లకు సహాయపడటానికి మీ వ్యక్తిగత ఎక్స్‌పీరియన్స్‌ను యాప్‌తో లేదా గేమ్‌తో షేర్ చేసుకోవడం కోసం ఈ విధానాన్ని ఉపయోగిస్తారు, ఇది ఇతర యూజర్‌లకు, ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలో లేదా ఏం కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది.
- ఆడియన్స్: రివ్యూలు మీ Google ఖాతాకు సంబంధించిన మీ పేరును, ఇమేజ్‌ను డిస్‌ప్లే చేస్తూ ఇతర Google Play యూజర్‌లకు, డెవలపర్‌లకు పబ్లిక్‌గా కనిపిస్తాయి.
- కంటెంట్ గైడ్‌లైన్స్: రివ్యూలు ఉపయోగకరంగా, సమాచారం అందించేవిగా, నిజమైన ఎక్స్‌పీరియన్స్ గురించి తెలియజేసేవిగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా ఉండాలి. నకిలీ లేదా ఖచ్చితత్వం లేని రివ్యూలను, పదే పదే చేసే పోస్ట్‌లను, ఒకే కంటెంట్ విషయంలో పలు ఖాతాల నుండి రివ్యూలు రాయడాన్ని, లేదా యూజర్‌లను తప్పుదారి పట్టించడానికి లేదా రేటింగ్‌లను మార్చడానికి ఉద్దేశించిన రివ్యూలను ఎలాంటి మినహాయింపులు లేకుండా Google నిషేధిస్తుంది. రివ్యూలు తప్పనిసరిగా టాపిక్‌కు సంబంధించినవిగా ఉండాలి, వాటిలో ప్రమోషనల్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా విద్వేషాల�� పెంచే కంటెంట్ ఉండకుండా చూసుకోవాలి.
వేరొక Google Play యూజర్ అందించిన కామెంట్ లేదా రివ్యూ గురించి మీరు ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వవచ్చు. దిగువున ఉన్న ఫీడ్‌బ్యాక్ ఆప్షన్‌ల గురించి చదవండి. మేము యాప్ రివ్యూలను ఎలా ప్రాసెస్ చేస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
కామెంట్ లేదా రివ్యూను ఫ్లాగ్ చేయండి- Google Play యాప్
ను తెరవండి.
- మీరు ఫ్లాగ్ చేయాలనుకుంటున్న కామెంట్ లేదా రివ్యూను గుర్తించండి.
- మరిన్ని
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
డెవలపర్‌లు, కామెంట్‌లు లేదా రివ్యూలకు పబ్లిక్‌గా రిప్లయి ఇవ్వవచ్చు. మీరు డెవలపర్ కామెంట్ పోస్టింగ్ పాలసీని ఫాలో అవ్వని రిప్లయిని అందుకున్నట్లుగా భావిస్తే ఈ దశలను ఫాలో అవ్వండి:
- మీరు అందుకున్న, డెవలపర్ సమాధానంతో కూడిన ఈమెయిల్‌లో, డెవలపర్ రిప్లయి గురించి రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఈ ఫారమ్‌ను పూరించండి. సంబంధిత డెవలపర్ కామెంట్, డెవలపర్ పేరు, సంక్షిప్త సారాంశానికి నేరుగా లింక్‌ను చేర్చారని నిర్ధారించుకోండి.
Google Playలో యాప్‌ను లేదా రివ్యూను ఫ్లాగ్ చేయడం అనేది రివ్యూ చేసి, చర్య తీసుకోవడానికి నిర్దిష్ట సమస్యను లేదా పాలసీ ఉల్లంఘనను రిపోర్ట్ చేయడం కోసం (దురుద్దేశంతో కూడిన పద్ధతుల గురించి, మోసపూరిత రివ్యూల గురించి లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ గురించి రిపోర్ట్ చేయడం) ఉపయోగించే ప్రత్యక్ష విధానం.
యూజర్ రివ్యూను అందించడం అనేది యాప్‌తో లేదా గేమ్‌తో మీ వ్యక్తిగత ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడానికి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తుంది. ఇతర యూజర్‌లు ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలో లేదా ఏం కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవడంలో సహాయపడటం దీని లక్ష్యం.