ప్రతి రోజు రాత్రిపూట స్వీట్ తినాలనిపిస్తోందా? పోషకాల లోపమే కారణమా?

Published on Aug 30, 2026 12:20 pm IST

రాత్రి భోజనం ముగిశాక స్వీట్లు లేదా డెజర్ట్ తినాలనే కోరిక వెనుక కేవలం పోషకాల లోపం మాత్రమే ఉందనుకోవడం పొరపాటే. అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి, రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

1 / 5

సోషల్ మీడియా రీల్స్ చూస్తే చాలు.. మన శరీరంలో వచ్చే ప్రతి చిన్న మార్పుకూ, కోరికకూ ఏదో ఒక పోషకాహార లోపమే కారణమని ప్రచారం చేస్తుంటారు. చాక్లెట్ తినాలనిపిస్తే మెగ్నీషియం లోపమని, సాల్టీ ఫుడ్​పై మనసు పడితే అడ్రినల్ అలసట అని రకరకాల సిద్ధాంతాలు వండి వారుస్తుంటారు.

అయితే మానవ శరీరం సోషల్ మీడియా థంబ్‌నెయిల్స్ చెప్పినంత సులువుగా పనిచేయదు. రాత్రి భోజనం ముగిశాక ఏదో ఒక తీపి పదార్థం తినాలనే కోరిక వెనుక ఏదో ఒక ఒక్క పోషక లోపం మాత్రమే ఉండదు. ఉదయం నుంచి తిన్న ఆహారం, తీసుకున్న విశ్రాంతి, అనుభవించిన మానసిక ఒత్తిడి.. ఇవన్నీ కలిసి రాత్రిపూట మన తిండి కోరికలను శాసిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
expand-icon View Photos in a new improved layout

2 / 5

చాలామంది నిత్యం ఒకే రకమైన లైఫ్‌స్టైల్ పొరపాట్లు చేస్తుంటారు. ఉదయం హడావుడిలో టిఫిన్ ఎగ్గొట్టడం, మధ్యాహ్నం డైటింగ్ పేరిట సగం కడుపుతో సరిపెట్టుకోవడం, సాయంత్రం అలసట తగ్గించుకోవడానికి కప్పు కాఫీ/ టీతో బిస్కెట్లు లాగించడం చేస్తుంటారు. చివరికి రాత్రి భోజన సమయానికి శరీరం రోజంతా కోల్పోయిన కేలరీలను ఒకేసారి డిమాండ్ చేస్తుంది. ఆ సమయానికి మెదడుకు తక్షణ ఇంధనం కావాల్సి రావడంతో స్వీట్లు, డెజర్ట్‌ల వైపు మనసు లాగుతుంది.

3 / 5

పోషకాల లోపం కంటే రాత్రిపూట తీపి కోరికలకు మన అలవాట్లే ప్రధాన కారణం. మన ఇళ్లలో భోజనం ముగిశాక చిన్న బెల్లం ముక్కో, ఒక స్వీటో లేదా పాయసమో తినే అలవాటు చిన్నతనం నుంచే ఉంటుంది. ఆహారం అనేది కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు; అదొక సాంస్కృతిక అలవాటు, హాయినిచ్చే అనుభూతి. భోజనం తర్వాత తీపి తింటేనే కడుపు నిండినట్లు మెదడు సంకేతాలు పంపుతుంది. దాvfతో స్వీట్ తినకపోతే భోజనం అసంపూర్తిగా మిగిలిపోయిన భావన కలుగుతుంది.

4 / 5

మన సాంప్రదాయ భోజనంలో అన్నం, రొట్టెలు వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట తినే తిండిలో తగినంత ప్రొటీన్, ఫైబర్ లేకపోతే, భోజనం చేసిన కొద్దిసేపటికే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా తగ్గిపోతాయి. ఇది మెదడును తక్షణ శక్తి కోసం తీపి పదార్థాల వైపు ప్రేరేపిస్తుంది. దీనికి తోడు రోజంతా పనిచేసి అలసిపోయిన మెదడు, రాత్రి వేళ సులభంగా ఉపశమనం పొందేందుకు తీపి పదార్థాల వైపు మొగ్గుచూపుతుంది. ఇక్కడ క్రమశిక్షణ లేకపోవడం సమస్య కాదు, అదొక సహజమైన జీవక్రియ. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని తీపి పదార్థాలపై ధ్యాస పెరుగుతుంది.

5 / 5

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగ��� ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!